విశాఖపట్నం(ఆంధ్రప్రదేశ్), మార్చి ఆంధ్రవిశ్వవిద్యాలయాన్ని అమెరికా నావికాదళ బృందం శుక్రవారం ఉదయం సందర్శించారు. ముందుగా ఏయూ వీసీ ఆచార్య పి.వి.జి.డి ప్రసాద రెడ్డితో పరిపాలనా భవనంలో సమావేశమయ్యారు. యుఎస్ నేవీ కెప్టెన్ కమాండిరగ్ ఆఫీసర్, ఎస్ఎస్ఎస్ సోమిర్సెట్(ఎల్పిడి 25) కెప్టెన్ మిచెల్ సి. బ్రాండ్ నేతృత్వంలో పలువురు నావికాదళ సిబ్బంది ఏయూను సందర్శించారు. వీరికి ఏయూ ఎన్సిసి విద్యార్థుల బృందం గౌరవ వందనంతో స్వాగతించారు. అనంతరం అకడమిక్ సెనేట్ మందిరంలో నిర్వహించిన కార్యక్రమంలో అమెరికా నావికాదళ సిబ్బందిని ఉద్దేశించి వీసీ ఆచార్య పి.వి.జి.డి ప్రసాద రెడ్డి ప్రసంగించారు. ఏయూలో ఒక మల్టీడిసిప్లీనరీ విశ్వవిద్యాలయంగా నిలుస్తుందన్నారు. క్రీడలు, యోగా, సైకాలజీ, సెంటర్ ఫర్ డిఫెన్స్ స్టడీస్ వంటి వైవిధ్యత కలిగిన విభాగాలు ఉన్నాయన్నారు. దేశంల రక్షణ రంగాలకు విద్యపరంగా సేవలు అందిస్తున్న వర్సిటీకీ ఏయూ పేరుగాంచిందని వారికి వివరించారు. వైవిధ్యతను తాము స్వాగతిస్తామని, యుఎన్ఏ నావికలు తమ ఆలోచనలను పంచుకోవాలని కోరారు. మంచి స్నేహాన్ని తాము కోరుకుంటామన్నారు. ప్రపంచాన్ని అంత్యంత ఆనందాయకంగా నిలపాని ఆకాంక్ష వ్యక్తం చేశారు. ప్రస్తుతం భారత దేశంలో త్రివిధ దళాల ఉద్యోగులకు ఉన్నత విద్యను చేరువ చేసే దిశగా ఏయూ పనిచేస్తోందని, భవిష్యత్తులో విదేశీ సైనికులకు సైతం ఉన్నత విద్య అవకాశాలను కల్పించడానికి సిద్దంగా ఉన్నామన్నారు. అమెరికా నావికాదళం కమాండిరగ్ ఆఫీసర్ మిచెల్ సి. బ్రాండ్ మాట్లాడుతూ సిటీ ఆఫ్ డెస్టినీగా పేరుగాంచిన విశాఖ నగరం తమకు ఎంతో నచ్చిందన్నారు. సముద్రతీరం, ఎత్తైన కొండలు కలిగిన ఈ ప్రాంతం తమకు నచ్చిందన్నారు. భారతీయ సంస్కృతిని తాము నేర్చుకుంటున్నామన్నారు. విభిన్న విభాగాలతో పెద్ద విశ్వవిద్యాలయంగా ఏయూ తమకు కనిపిస్తోందన్నారు. కార్యక్రమంలో ఏయూ రిజిస్ట్రార్ ఆచార్య ఎం.జేమ్స్ స్టీఫెన్, అమెరికన్ ఎంబసీ అధికారి జో క్రిష్టోఫర్ తదితరులు పాల్గొన్నారు. అనంతరం ఏయూ అమెరికన్ కార్నర్ వద్ద మెక్కలు నాటే కార్యక్రమం, వాల్ పెయింటింగ్ కార్యక్రమాలలో అమెరికా నావికాదళ సిబ్బంది పాల్గొన్నారు. అనంతరం అమెరికన్ కార్నర్లో నిర్వహించిన కార్యక్రమంలో అమెరికా నావికాదళం కమాండిరగ్ ఆఫీసర్ సి.బ్రాంట్త్ ప్రసంగించారు.
