అనంతపురం కదిరి మాజీ ఎమ్మెల్యే కందికుంట వెంకటప్రసాద్పై నమోదైన కేసును తెలంగాణ హైకోర్టు కొట్టివేసింది. 1999, 2003లో నకిలీ డీడీలతో బంగారం కొనుగోలు చేశారని… కందికుంట వెంకటప్రసాద్పై సీబీఐ(CBI) రెండు కేసులు నమోదు చేసింది. ఒక కేసులో ఐదు సంవత్సరాలు… మరో కేసులో ఏడు సంవత్సరాల జైలు శిక్ష విధిస్తూ అప్పట్లో నాంపల్లి సీబీఐ కోర్టు తీర్పు ఇచ్చింది.
అయితే సీబీఐ కోర్టు తీర్పును సవాల్ చేస్తూ మాజీ ఎమ్మెల్యే కందికుంట వెంకటప్రసాద్ తెలంగాణ హైకోర్టును ఆశ్రయించారు. ఈరోజు దీనిపై తెలంగాణ హైకోర్టులో విచారణ జరగగా.. కందికుంట వెంకటప్రసాద్కు అనుకూలంగా న్యాయస్థానం తీర్పునిచ్చింది. దీంతో వెంకటప్రసాద్పై కేసులు కొట్టివేయడంతో ఆయన అభిమానులు, టీడీపీ నేతలు, కార్యకర్తలు టపాసులు పేల్చి సంబరాలు చేసుకున్నారు.
