తెలంగాణ : హైదరాబాద్ : జనవరి 20( హింస)
అమెజాన్ లో అయోధ్య లడ్డూల పేరుతో నకిలీ ప్రసాదం అమ్మకాలు తీవ్ర కలకలం రేపుతున్నాయి. అయోధ్య లడ్డూలు అంటూ అమెజాన్ లో ప్రసాదాల అమ్మకాలు మొదలు పెట్టింది. దీంతో భక్తులు, ప్రజలు కొనుగోలు చేసేందుకు భారీగా ఆర్డర్లు వచ్చాయి. భారీ లాభానికి అమెజాన్ ఇలాంటి దిగ్గజ కంపెనీలు తెగపడటం సంచలనంగా మారింది. అయోధ్యా రామ మందిరంలో రాముడి ప్రతిష్టనే ఇంకా జరిగేందుకు రెండు రోజులు వున్నా.. దానిని ఆసరాగా తీసుకున్న కొందరు అయోధ్య పేరుతో అమ్మకాలకు తెర లేపుతున్నారు. దిగ్గజకంపెనీలోనే ఒకటిగా పేరు పొందిన అమెజాన్ లో అయోధ్య పేరుతో నకిలీ ప్రసాదాలు అమ్మకానికి పెట్టడం కీలకంగా మారింది. ఇది నిజమని నమ్మిన కొందరు భక్తులు, ప్రజలు వేలకొద్ది ఆర్డర్లు పెట్టడంతో అసలు విషయం వెలుగులోకి వచ్చింది. అమెజాన్ ఫ్రాఢ్ ని గమనించిన కేంద్రం దానిపై నోటీసులు జారీ చేసింది. కాన్ఫెడరేషన్ ఆఫ్ ఆల్ ఇండియా ట్రేడర్స్ కు ఫిర్యాదు చేసింది. ఈవిషయం పై రంగంలోని దిగిన అధికారులు అమెజాన్ కు సెంట్రల్ కన్సుమర్ ప్రొటెక్షన్ అథారిటీ నోటీసులు జారీ చేసింది.
పుట్ట సుమన్, హిందూస్తాన్ సమాచార
