తెలంగాణ : హైదరాబాద్ :అక్టోబర్ 14
తెలంగాణ ఆత్మగౌరవానికి, అద్వితీయ సాంస్కృతిక అస్తిత్వానికి ప్రతీకగా పూలను పూజించే పండుగ బతుకమ్మ అని సీఎం కేసీఆర్ అన్నారు. ఇవాళ ఎంగిలిపూల బతుకమ్మ ను ప్రారంభించిన సందర్భంగా రాష్ట్రంలోని ఆడబిడ్డలందరికీ సీఎం కేసీఆర్ శుభాకాంక్షలు తెలిపారు. బతుకమ్మ పండుగను రాష్ట్ర పండుగగా నిర్వహిస్తున్నామని, తెలంగాణ సంస్కృతి సంప్రదాయాలపై రాష్ట్ర ప్రభుత్వానికి ఎంతో గౌరవం ఉందన్నారు. ఎంగిలి పూల బతుకమ్మతో ప్రారంభించి చివరి రోజు సద్దుల బతుకమ్మతో ముగిసే వరకు ఆడపిల్లలు, అబ్బాయిలు అందరూ కలిసి ఆటలు, కోలాటాలతో జరుపుకోవాలి. ప్రపంచ వ్యాప్తంగా ప్రకృతితో మమేకమైన తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాల గొప్పతనాన్ని బతుకమ్మ పండుగ చాటిచెబుతుందని అన్నారు.
