ఢిల్లీ కడప పార్లమెంట్ బరిలో వైఎస్ షర్మిల నిలవనున్నారు. ఢిల్లీలో నేడు కాం గ్రెస్ సెంట్రల్ ఎలక్షన్ కమిటీ సమావేశం జరిగింది. ఈ సమావేశంలో పార్టీ ఏపీలో పోటీ చేయబోయే అభ్యర్థుల విషయమై కొన్ని కీలక నిర్ణయాలు తీసుకుంది. తిరుపతి, నంద్యాల, అనంతపురం, గుంటూరు, విజయవాడ, అమలాపురం, కర్నూల్, అరకు స్థానాలను ఇంకా పార్టీ పెండింగ్లోనే పెట్టింది. కమ్యూనిస్టులు, ఇతర ప్రతిపక్షాలకు సీట్ల కేటాయింపు నేపథ్యంలో కొన్ని స్థానాలను ఏపీ కాంగ్రెస్ పార్టీ పెండింగ్లో పెట్టింది.
రాజమండ్రి పార్లమెంట్ బరిలో గిడుగు రుద్రరాజు, బాపట్ల నుంచి జేడీ శీలం పోటీ చేయనున్నారు. అయితే సీనియర్ నేత రఘువీరా రెడ్డి మాత్రం ఈసారి ఎన్నికల్లో పోటీకి దూరంగా ఉండనున్నారు. మాజీ ఎంపీ పల్లం రాజును కాంగ్రెస్ అధిష్టానం కాకినాడ నుంచి బరిలోకి దింపనుంది. ఏపీలో 117 అసెంబ్లీ,17 లోక్ సభ స్థానాలపై సీఈసీలో చర్చ జరిగింది. వీటిలో 58 అసెంబ్లీ, 8 లోక్ సభ స్థానాలను కాంగ్రెస్ పార్టీ పెండింగ్ పెట్టింది. నంద్యాల, తిరుపతి,అనంతపురం, కర్నూలు, విజయవాడ, అరకు, గుంటూరు, అమలాపురం లోక్ సభ స్థానాలను పెండింగ్లో ఉంచింది.
