రాజమహేంద్రవరం 14 అక్టోబర్ : సెంట్రల్ జైల్లో రిమాండ్‌లో ఉన్న టీడీపీ అధినేత చంద్రబాబు ఆరోగ్య పరిస్థితిపై ఒక్కసారిగా సర్వత్రా ఆందోళన నెలకొంది.
ఆయన ఆరోగ్యం క్షీణిస్తోందని.. ఒక్క నెలలో ఐదు కిలోల బరువు తగ్గిపోయారన్న సమాచారం శుక్రవారం వైరల్ కావడంతో కుటుంబ సభ్యులు, టీడీపీ శ్రేణులు కలవరానికి గురయ్యారు. జగన్ సర్కారు తీరుపై విరుచుకుపడ్డారు. బాబు ఆరోగ్యం భేషుగ్గా ఉందన్న అధికార పార్టీ.. అంతా బాగానే ఉందని జైలు అధికారులతో చెప్పించే ప్రయత్నం చేసింది. కానీ అనధికారికంగా వ్యాప్తిలోకి వచ్చిన సమాచారం ఆయన ఆరోగ్య పరిస్థితి ఇబ్బందికరంగానే ఉందని సూచించింది.
