తెలంగాణ : హైదరాబాద్ : జనవరి 2( హింస)
తెలంగాణ తొలి పౌరురాలు తమిళ సై సౌందర రాజన్ కి అయోధ్య రాముల వారి అక్షింతలను శ్రీరామ జన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్ట్ సభ్యులు అందజేశారు. జనవరి ఒకటవ తేదీ నుంచి 15వ తారీకు వరకు నిర్వహించే జన సంపర్క అభియాన్ కార్యక్రమాన్ని జనవరి 1న ఇవాళ (సోమవారం) రాష్ట్ర గవర్నర్ చేత ప్రారంభించారు. అయోధ్యలో భవ్యమైన రామ మందిర నిర్మాణంతో వందల ఏళ్ల నాటి హిందువుల కల సహకారమవుతోందనీ శ్రీరామ జన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్టు సభ్యులు పేర్కొన్నారు. ప్రపంచంలోని ప్రతి హిందువుకు రాముల వారి అక్షింతలు అందజేసి, మందిర దర్శనానికి ఆహ్వానం పలుకుతున్నట్లు చెప్పారు. అందులో భాగంగానే తొలిరోజు రాష్ట్ర ప్రథమ పౌరురాలు గవర్నర్ కి సంప్రదాయబద్ధంగా బొట్టుపెట్టి , అక్షింతలు, కుంకుమ, పసుపు, గాజులు అందజేసి రామమందిరా దర్శనానికి ఆహ్వానం పలికినట్లు వివరించారు.
పుట్ట సుమన్, హిందూస్తాన్ సమాచార
