







శ్రీకాకుళం: 04 జనవరి (హిం.స)‘నిజం గెలవాలి’ పేరుతో నేడు ఉమ్మడి శ్రీకాకుళం జిల్లాలో టీడీపీ అధినేత నారా చంద్రబాబునాయుడు సతీమణి నారా భువనేశ్వరి పర్యటించనున్నారు.
చంద్రబాబు అక్రమ అరెస్టును తట్టుకోలేక మృతి చెందిన కార్యకర్తల కుటుంబాలను పరామర్శించనున్నారు. ఎచ్చెర్ల నియోజకవర్గం జి.సిగదాం మండలం దవళపేటలో కంచరానా అసిరినాయుడు కుటుంబాన్ని, భామిని మండలం బెల్లమడ గ్రామానికి చెందిన బర్రి విశ్వనాథం కుటుంబాన్ని, ఆముదాలవలస నియోజకవర్గంలోని గొర్ల తిరుపతిరావు, ఆకేటి పాపయ్య, గేదెల సాంబమూర్తి కుటుంబాలను కలిసి భువనేశ్వరి పరామర్శించనున్నారు.
హిందూస్తాన్ సమాచార, రాజీవ్
