ఢిల్లీ,04,జనవరి (హిం.స) మాజీ ముఖ్యమంత్రి, దివంగత వైఎస్ రాజశేఖర్రెడ్డి కుమార్తె, ఏపీ సీఎం వైఎస్ జగన్ సోదరి షర్మిల కాంగ్రెస్లో చేరారు. ఆమె కాంగ్రెస్ కండువా కప్పుకున్నారు. ఢిల్లీలోని ఏఐసీసీ కార్యాలయంలో మల్లిఖార్జున ఖర్గే, రాహుల్ గాంధీ సమక్షంలో ఆమె కాంగ్రెస్ కండువా కప్పుకున్నారు. ఆమెను సాదరంగా పార్టీలోకి ఆహ్వానించారు కాంగ్రెస్ అగ్రనేతలు. అనంతరం ఆమో వైఎస్ఆర్టీపీని కాంగ్రెస్లో విలీనం చేశారు. ఆనంతరం షర్మిల మాట్లాడుతూ. వైఎస్ రాజశేఖర్ రెడ్డి తన ఆఖరి శ్వాస వరకు కాంగ్రెస్ పార్టీ కోసం పనిచేశారని ఆమె అన్నారు. ఆయన బిడ్డగా ఇప్పుడు మళ్లీ కాంగ్రెస్ పార్టీలో చేరుతున్నందుకు సంతోషంగా ఉందన్నారు షర్మిల. పార్టీ ఎలాంటి బాధ్యతలు అప్పజెప్పినా.. స్వీకరిస్తామని చెప్పారు.
హిందూస్తాన్ సమాచార్ ,నాగరాజ్
