కాకినాడ:12 జనవరి (హిం.స( వైసీపీకి ప్రత్తిపాడు ఎమ్మెల్యే పర్వత ప్రసాద్ షాక్ ఇచ్చారు. నేటి నుంచి ప్రజా దివెన పేరుతో ప్రజల్లోకి వెళ్లాలని ఆయన నిర్ణయించుకున్నారు. ఇటీవల ఎమ్మెల్యే పర్వత ప్రసాద్‌కు జగన్ టికెట్ నిరాకరించారు. ప్రసాద్‌ను తప్పించి మాజీ ఎమ్మెల్యే వరుపుల సుబ్బారావుకి జగన్ టికెట్ కేటాయించారు. తీవ్ర అసంతృప్తితో ఉన్న ఎమ్మెల్యే పర్వత ప్రసాద్.. వైసీపీకి ఝలక్ ఇచ్చేందుకు సిద్దమయ్యారు. ఈ నేపథ్యంలో ప్రజా దీవెన పేరుతో జనంలోకి వెళ్లి బల ప్రదర్శన చేయాలని నిర్ణయం తీసుకున్నారు.
హిందూస్తాన్ సమాచార రాజీవ్
