ఆంధ్రప్రదేశ్ 13 అక్టోబర్ (హిం.స)ఐఏఎస్, ఐపీఎస్ వంటి సివిల్ సర్వీసెస్ చేయాలనే ఆశావహులకు జగన్ ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది.
సివిల్ సర్వీసెస్ అస్పిరెంట్సుకు ఆర్థిక సాయం జగన్ సర్కార్ చేయనుంది. ఏపీ నుంచి ఐఏఎస్, ఐపీఎస్‌లు కావాలనుకునే వారికి జగనన్న సివిల్ సర్వీసెస్ ప్రొత్సాహక పథకం పేరుతో ఆర్థిక సాయం అందించనుంది.
జగనన్న సివిల్ సర్వీసెస్ పథకానికి గైడ్ లైన్స్ ఇస్తూ జీవో జారీ చేసింది. సివిల్స్ ప్రిలిమ్స్, మెయిన్స్ పరీక్షల్లో ఉత్తీర్ణులైన వారికి లక్ష రూపాయలు, 50 వేల చొప్పున ఆర్థిక సహకారాన్ని అందించాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది.
