గూడూరు, 13 అక్టోబర్ : కృష్ణా జిల్లాలోని వివిధ ప్రాంతాల్లో సరఫరా చేసిన వైఎస్సార్ సంపూర్ణ పోషణ కిట్లలో పాడైపోయిన పదార్థాలు వస్తున్నాయని లబ్ధిదారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
తాజాగా గూడూరు పంచాయతీ పరిధిలోని అంగన్‌వాడీ కేంద్రం ద్వారా పంపిణీ చేసిన కిట్లలో పాడైపోయిన ఖర్జూర పళ్లను ఓ మహిళ గుర్తించారు.
పుచ్చిపోయిన ఖర్జూరంలో పురుగులూ ఉండటంతో ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇలాంటివే గ్రామంలో మరో ఇద్దరికి సరఫరా అయినట్లు స్థానికులు చెబుతున్నారు.
అప్పుడప్పుడు పాలూ బాగుండటం లేదని తెలిపారు. వేరుసెనగ చిక్కీలూ ప్యాకెట్లలో సగమే ఉన్నాయని వాపోయారు.
