హైదరాబాద్, 7 జూలై (హి.స.)
తెలంగాణలోని స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు కల్పించేందుకు ఉద్దేశించిన బిల్లులను కేంద్ర ప్రభుత్వం వెంటనే ఆమోదించాలనే డిమాండ్ తో పోరాటం చేస్తున్న తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు, ఎమ్మెల్సీ కవిత రేపు ఢిల్లీకి వెళ్లనున్నారు. అక్కడ పలువురు జాతీయ నేతలతో భేటీ అయి అనంతరం హస్తిన వేదికగా మీడియా సమావేశం నిర్వహించబోతున్నట్లు తెలుస్తోంది. బీసీ బిల్లు తీసుకురావాలని కేంద్రంపై ఒత్తిడి తెచ్చేందుకు జులై 17న జాగృతి ఆధ్వర్యంలో రైల్ రోకో చేపడుతున్న సంగతి తెలిసిందే. ఈ విషయంలో మద్దతు కోసం కవిత ఇప్పటికే పలు పార్టీలు, సంస్థల అగ్రనాయకులను కలిసి మద్దతు కూడగడుతున్నారు.
హిందూస్తాన్ సమచార్ / సంపత్ రావు, జర్నలిస్ట్..
