కర్నూలు, 21 కర్నూలు జిల్లా మద్దికెరలో విలేకరి కె.వీరశేఖర్‌పై వైసీపీ మూకలు దాడికి దిగాయి. పత్తికొండ ఎమ్మెల్యే కంగాటి శ్రీదేవి మండల కేంద్రమైన మద్దికెరలో హెల్త్ క్లీనిక్, మద్దికెర-బీఎన్ పేట రోడ్డు ప్రారంభోత్సవ కార్యక్రమానికి హాజరయ్యారు.
కవరేజీకి వెళ్లిన వీరశేఖర్‌పై వైసీపీ నాయకుడు, స్థానిక వీఆర్వో సోదరుడు రంగస్వామి, మరి కొందరు దాడికి తెగబడ్డారు. ‘మాకే వ్యతిరేకంగా వార్తలు రాస్తావా..? హౌసింగ్ బిల్లులో అక్రమాలు జరిగాయని రాస్తావా…? నీ అంతు చూస్తా’మంటూ వీరశేఖర్‌పై ఒక్కసారిగా దాడిచేసి.. చొక్కా పట్టుకుని, చేతులతో కొట్టారు. కవరేజీకి వెళ్లిన ఇతర జర్నలిస్టులు శేఖర్‌కు రక్షణగా నిలిచారు. అనంతరం వీరశేఖర్, ఇతర పాత్రికేయులు పోలీ్‌సస్టేషన్‌లో ఫిర్యాదుచేశారు.
