ఆంధ్రప్రదేశ్ : అమరావతి 20 ఫిబ్రవరి నందిపాడు పంచాయతీలోని అయ్యనపల్లి రెవెన్యూలో సర్వే నం. 228-సీలో మొత్తం 1.17 ఎకరాల ప్రభుత్వ భూమి ఉంది. ఇప్పటికీ భూ దస్త్రాల్లో అది ప్రభుత్వ కార్యాలయాల కిందే చూపిస్తోంది. ఇందులోని ఎకరా స్థలంలో గతంలోనే వ్యవసాయ పరపతి సంఘం కార్యాలయాన్ని నిర్మించగా.. 17 సెంట్ల స్థలాన్ని అలాగే వదిలేశారు. ఇటీవల దుత్తలూరు- నందిపాడు మీదుగా జాతీయ రహదారి పడటంతో.. నందిపాడు కూడలిలోని స్థలాలకు గిరాకీ ఏర్పడింది. దీంతో సదరు స్థలంపై కొందరి కన్ను పడింది.
