దిల్లీ, 20, ఫిబ్రవరి జమిలి ఎన్నికలపై ఏర్పాటైన అత్యున్నత స్థాయి కమిటీ సమావేశం ఢిల్లీలో జరిగింది. మాజీ రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ ఆధ్వర్యంలో భేటీ అయింది. భారత మాజీ ప్రధాన న్యాయమూర్తులు జస్టిస్ దీపక్ మిశ్రా, జస్టిస్ ఎస్ఏ బాబ్డే పాల్గొన్నారు. జమిలి ఎన్నికలపై తమ అభిప్రాయాన్ని వెల్లడించారు.
ఈ అంశంపై ఢిల్లీ హైకోర్టు మాజీ ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డిఎన్ పటేల్తో కూడా కమిటీ సంప్రదింపులు జరిపింది.
ఈ కార్యక్రమంలో కేంద్ర హోం మంత్రి అమిత్ షా, N. K. సింగ్, 15వ ఆర్థిక సంఘం మాజీ ఛైర్మన్ డాక్టర్ సుభాష్ సి. కశ్యప్, మాజీ చీఫ్ విజిలెన్స్ కమిషనర్ సంజయ్ కొఠారి, సీనియర్ న్యాయవాది హరీష్ సాల్వే కూడా ఈ సమావేశానికి హాజరయ్యారు. ఇప్పటివరకు జరిగిన కార్యకలాపాలు మరియు పురోగతిపై సమీక్షించారు.
