పాడేరు, 04 మార్చ్ జగన్‌ను మరోసారి గెలిపించడంలో వాలంటీర్లది కీలకపాత్రని వైసీపీ ఉత్తరాంధ్ర సమన్వయకర్త వైవీ సుబ్బారెడ్డి అన్నారు.
వాలంటీర్లు, గృహసారథులు శక్తి వంచన లేకుండా పనిచేసి జగన్‌మోహన్‌రెడ్డిని తిరిగి ముఖ్యమంత్రిని చేయాలని పిలుపునిచ్చారు. ప్రతిపక్ష పార్టీలు అమలు చేయలేని హామీలతో ముందుకొస్తున్నాయని, వాటిపై ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు.
అల్లూరి సీతారామరాజు జిల్లా పాడేరులో ఆదివారం ఎన్నికల ప్రచార సభ నిర్వహించారు. ముఖ్య అతిథులుగా సుబ్బారెడ్డి, మంత్రి గుడివాడ అమర్‌నాథ్ హాజరయ్యారు. మంత్రి అమర్‌నాథ్ మాట్లాడుతూ.. వైసీపీ పాలనలో గిరిజన సంక్షేమానికి పెద్దపీట వేశామని తెలిపారు.
