అమరావతి, అక్టోబరు 13 : టెక్ మహీంద్ర సంస్థ ఎండీ, సీఈవో సీపీ గుర్నాని ముఖ్యమంత్రి జగన్మోహన్‌రెడ్డితో భేటీ అయ్యారు.
గురువారం సీఎం నివాసంలో జరిగిన ఈ సమావేశంలో రాష్ట్ర పర్యాటక రంగం అభివృద్ధికి ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలు, ప్రోత్సాహకాల గురించి జగన్ వివరించారు.
రాష్ట్రంలో విశాఖపట్నం సహా మూడు ప్రాంతాల్లో 5 స్టార్, 7 స్టార్ హోటల్స్ నిర్మాణానికి మహీంద్ర గ్రూప్ ప్రతినిధులు సంసిద్ధత వ్యక్తం చేశారు. ఒక్కో హోటల్ నిర్మాణానికి రూ.250 కోట్లు చొప్పున ఖర్చు చేయనున్నట్లు తెలిపారు.
