అమరావతి, 04 జనవరి (హి.స.):ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజధాని అమరావతి సమీప గ్రామాల్లో మౌలిక వసతులు కల్పిస్తున్నామని మంత్రి నారాయణవ్యాఖ్యానించారు. ఈ పనులు సుమారు రూ.900కోట్లతో జరుగుతున్నాయని వెల్లడించారు. రాజధాని నిర్మాణంతో పాటు గ్రామాలను అభివృద్ధి చేయాలని సీఎం నారా చంద్రబాబు నాయుడు చెప్పారని ప్రస్తావించారు. ఆరునెలల్లోగా అన్ని గ్రామాల్లో మౌలిక వసతులు కల్పిస్తామని పేర్కొన్నారు. ల్యాండ్ పూలింగ్ సమయంలో ఇచ్చిన మాట ప్రకారం రైతులకు అన్ని హామీలు నెరవేరుస్తామని భరోసా కల్పించారు. ఈ విషయంలో అధైర్యపడొద్దని ధైర్యం చెప్పారు. రాజధాని గ్రామం ఐనవోలులో మంత్రి నారాయణ పర్యటించారు.
—————
హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ
