తెలంగాణ రంగా రెడ్డి కొత్తూరు ఏప్రిల్
ఆశీర్వదించండి భారీ మెజారిటీతో పార్లమెంట్ ఎన్నికల్లో గెలిపించండి
సిడబ్ల్యూసి ప్రత్యేక ఆహ్వానితులు, మహబూబ్ నగర్ పార్లమెంట్ అభ్యర్థి చల్లా వంశీ చంద్ రెడ్డి
కొత్తూర్ మండలం కొత్తూర్ మున్సిపలిటి కేంద్రంలో గణపతి గార్డెన్లో ఏర్పాటు చేసిన కొత్తూర్, నందిగామ ఉమ్మడి కాంగ్రెస్ కార్యకర్తల సమావేశంలో సిడబ్ల్యుసి ప్రత్యేక ఆహ్వానితులు మహబూబ్ నగర్ పార్లమెంట్ అభ్యర్థి చల్లా వంశీ చంద్ రెడ్డి, ఎమ్మెల్యే వీర్ల పల్లి శంకర్, మాజీ ఎమ్మెల్యే చౌలపల్లి ప్రతాప్ రెడ్డి, మాజీ జడ్పీటీసి శ్యామ్ సుందర్ రెడ్డి, మాజీ ఎంపీపీ శివ శంకర్ గౌడ్, తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా చల్లా వంశీ చంద్ రెడ్డి మాట్లాడుతూ.. వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో 14 స్థానాల్లో కాంగ్రెస్ పార్టీ విజయం సాధించబోతోంది. అర్హులైన ప్రతి ఒక్కరికి కాంగ్రెస్ పార్టీ ప్రకటించిన సంక్షేమ పథకాలన్నీ కూడా తప్పకుండా అమలు చేస్తాం. మన ప్రాంతాన్ని అభివృద్ధి పరుచుకొని సాగునీరు తాగునీరు ప్రతి ఒక్కరికి అందేలా కృషి చేస్తా
కార్యకర్తలే పార్టీకి పునాదిరాళ్లు వారు కష్టపడి పని చేస్తేనే మన లక్ష్యాన్ని చేరుకుంటాం పార్లమెంట్, ఎన్నికల లో ప్రతి ఒక్క కార్యకర్త నాయకుడు కష్టపడి పని చేయాలి కష్టపడ్డ వాళ్లకి తప్పక వారికి గుర్తింపు ఉంటుంది. మహబూబ్ నగర్ పార్లమెంట్ అభివృద్ధి బాటలో నడిపించే బాధ్యత నాది.నన్ను ఆశీర్వదించండి పార్లమెంట్ ఎన్నికల్లో భారీ మెజారిటీతో గెలిపించండి. ఈ కార్యక్రమంలో ఉమ్మడి మండల ప్రజాప్రతినిధులు నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.
