
ప్రకాశం: 31 జనవరి : ఉమ్మడి ప్రకాశం జిల్లాలో రెండో రోజు నారా భువనేశ్వరి పర్యటించనున్నారు. చంద్రబాబు అక్రమ అరెస్టుతో కలత చెంది హఠాన్మరణం చెందిన వారి కుటుంబ సభ్యులను ఆమె పరామర్శించనున్నారు. ఉదయం 11.20 గంటలకు దర్శి, మధ్యాహ్నం 12.15 గంటలకు ముండ్లమూరు మండలం శింగన్నపాలెం, 12.55 గంటలకు తాళ్ళూరు మండలం తూర్పు గంగవరం, 3.35 గంటలకు టంగుటూరు, సాయంత్రం 4.20 గంటలకు కొండపి మండలం కె.ఉప్పలపాడు, 6 గంటలకు ఉలవపాడు మండలం టెంకాయచెట్లపాలెంలో నారా భువనేశ్వరి పర్యటించనున్నారు. రాత్రికి ఆమె కందుకూరులో బస చేయనున్నారు.
