
లఖనవూ 31 జవవరి : అయోధ్యలో ఇటీవల ఘనంగా ప్రాణప్రతిష్ఠ జరుపుకొన్న బాలరాముడు పసిడి కాంతులతో దేదీప్యమానంగా వెలిగిపోతూ భక్తులకు దర్శనమిచ్చాడు. రామయ్య ఒంటిపై ఉన్న నగలు అందరిలోనూ ఆసక్తిని రేకెత్తించాయి.
ఈ రామ్‌లల్లా ఒంటిపై మొత్తం 15 కిలోల బంగారం, 18 వేల పచ్చలు (మరకతమణులు), వజ్రాలు ఉన్నాయి. నుదుట తిలకం, తలపై కిరీటం, నాలుగు హారాలు, నడుము పట్టీ, విజయమాల.. ఇలా మొత్తం పద్నాలుగు ఆభరణాలను అలంకరించారు. రాజధాని లఖ్‌నవూకు చెందిన నగల తయారీదారులు ప్రాణప్రతిష్ఠ వేడుకకు పక్షం రోజుల ముందు రామజన్మభూమి తీర్థక్షేత్ర ట్రస్టుకు ఈ ఆభరణాలను అప్పగించారు. కేవలం పన్నెండు రోజుల్లో ఈ ఆభరణాలు తయారుచేయడం విశేషం. పసిడి ఆభరణాలు రామయ్య దివ్య సౌందర్యాన్ని మరింత పెంచాయి.
