దిల్లీ,31,జనవరి : మనీలాండరింగ్ ఆరోపణలను ఎదుర్కొంటున్న జార్ఖండ్ సీఎం హేమంత్ సోరెన్ను ఈడీ అధికారులు బుధవారం విచారిస్తున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో ఈడీ అధికారులపై హేమంత్ సోరెన్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఎస్సీ, ఎస్టీ వేధింపుల చట్టం కింద చర్యలు తీసుకోవాలని కోరుతూ జార్ఖండ్ ముఖ్యమంత్రి హేమంత్ సోరెన్ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ అధికారులపై పోలీసులకు ఫిర్యాదు చేశారు. ధృవా పోలీసు స్టేషన్లో సీఎం హేమంత్ సోరెన్ ఫిర్యాదు చేసినట్లు రాంచీ పోలీసులు తెలిపారు.
భూ కుంభకోణానికి సంబంధించిన మనీలాండరింగ్ కేసులో సోరెన్ను బుధవారం రాంచీలోని అతని నివాసంలో దర్యాప్తు ఏజెన్సీ అధికారులు విచారించిన నేపథ్యంలో ఈ ఫిర్యాదు చేసినట్లు సమాచారం.
