ఢిల్లీ 14 మార్చ్ ఢిల్లీ హైకోర్టులో న్యాయమూర్తులుగా ఉన్న జస్టిస్ వి.కామేశ్వర్ రావు, జస్టిస్ సంజీవ్ సచ్‌దేవాను బదిలీ చేయడానికి సుప్రీంకోర్టు కొలీజియం నిర్ణయం తీసుకుంది.
తమను దిల్లీ హైకోర్టు నుంచి దేశంలోని ఇతర ఉన్నత న్యాయస్థానాలకు బదిలీ చేయాలని వారు కొలీజియానికి విన్నవించారు. దీంతో సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డీవై చంద్రచూడ్ నేతృత్వంలో సమావేశమైన కొలీజియం వారి విజ్ఞప్తిని అంగీకరించింది.
జస్టిస్ వి.కామేశ్వర్ రావును కర్ణాటకకు, జస్టిస్ సంజీవ్ సచ్‌దేవాను మధ్యప్రదేశ్ హైకోర్టులకు బదిలీ చేయడానికి నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు కేంద్ర ప్రభుత్వానికి సిఫారసు చేసింది.
