పిడుగురాళ్ల, 09 ఫిబ్రవరి : స్థానిక ఎమ్మెల్యే అహంకారంతో వ్యవహరిస్తున్నార’ని వైసీపీ ఎమ్మెల్సీ జంగా కృష్ణమూర్తి మండిపడ్డారు.
గురువారం రాత్రి పల్నాడు జిల్లా పిడుగురాళ్లలో అనుచరులతో ఆత్మీయ సమావేశం నిర్వహించారు. ‘పదవులు, సంపాదన కోసం ఎమ్మెల్యే కాసు మహేశ్‌రెడ్డి గ్రామాల్లో చిచ్చు పెడుతున్నారు. బడుగు, బలహీన వర్గాలను భయపెట్టి ఎన్నికల్లో మళ్లీ గెలవాలని చూస్తున్నారు.
ఇక్కడ నాకు జరుగుతున్న అవమానాలను పార్టీ పెద్దలు, ముఖ్యమంత్రి జగన్‌కు చెప్పినా పట్టించుకోలేదు. 2019లో గెలిచాక ఎమ్మెల్యే ఏ కార్యక్రమానికీ నన్ను పిలవలేదు. నన్ను పలకరించిన వాళ్లను ఇబ్బంది పెట్టారు. మన పార్టీ సామాజిక న్యాయం కోసం పని చేస్తుందని చెబుతూనే.. బడుగుల మనోభావాలను గుర్తించడం లేదు’ అని కృష్ణమూర్తి వాపోయారు.
