అమరావతి: 08 ఫిబ్రవరి నిజం గెలవాలి యాత్రలో భాగంగా రాజధాని ప్రాంతంలోని తుళ్లూరు మండలం వెంకటపాలెంలో నారా భువనేశ్వరి పర్యటిస్తున్నారు. ఈ క్రమంలో పాడి మహిళా రైతులతో భువనేశ్వరి ముఖాముఖి సమావేశంలో పాల్గొననున్నారు.
టీడీపీ అధినేత చంద్రబాబు అక్రమంగా అరెస్టు అయినప్పుడు ఆవేదనతో మరణించిన వారిని ఓదార్చేందుకు రాష్ట్ర వ్యాప్తంగా నారాభువనేశ్వరి పర్యటిస్తున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం రాజధాని ప్రాంతంలోని తాడికొండ తుళ్లూరు మండలాల్లో ఆమె పర్యటన కొనసాగుతోంది. కాగా నిజం గెలవాలి యాత్రలో భాగంగా నారా భువనేశ్వరి బుధవారం పల్నాడు జిల్లాలో పర్యటించారు.
జిల్లాలోని 5 కుంటుంబాలను పరామర్శించారు. మనమంతా ఒకే కుటుంబం.. ధైర్యంగా ఉండండి.. పార్టీ మీకు అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు. ఒక్కో కుటుంబానికి రూ.3 లక్షల చొప్పున ఆర్థిక సాయం అందజేశారు.
