నాయుడుపేట పట్టణం, శ్రీకాళహస్తి, 25 జనవరి (హిం.స) తుది ఓటర్ల జాబితాలోనూ వైకాపా నేతలకు ఒకటికి మించి ఓట్లు వెలుగుచూశాయి. ఫిర్యాదులు చేసినా ఆ ఓట్లు తొలగించకపోవడం గమనార్హం.
తిరుపతి జిల్లా నాయుడుపేట పట్టణం ఆర్ముగంనగర్‌కు చెందిన వైసీపీ నాయకుడు కామిరెడ్డి రాజారెడ్డికి స్థానిక పురపాలికతో పాటు రెండు పంచాయతీల్లోనూ ఓటు హక్కు ఉన్నట్లు తేలింది. ఆయనతోపాటు కుటుంబ సభ్యులకు ఓట్లు ఉండటం గమనార్హం.
నాయుడుపేట 68వ పోలింగ్ కేంద్రం, వేముగుంటపాళెం, మర్లపల్లిలో రాజారెడ్డి దంపతులకు ఓట్లు ఉన్నాయి. మరోవైపు తిరుపతి జిల్లా శ్రీకాళహస్తి 18వ వార్డులోని 52వ పోలింగ్ కేంద్రం జాబితాలో ఇంటి నంబరు 1-620లోని ఓటరు వివరాలు అర్థం కాని భాషలో ప్రచురించారు.
