



సాగర్‌నగర్, 19 జనవరి (h.స)సాగర్‌నగర్ ఇస్కాన్ మందిరంలో అమెరికాలోని ఇస్కాన్ గురువులు వేదవ్యాస ప్రియస్వామి మహరాజ్, జయద్వైత స్వామి మహరాజ్ రాక సందర్భంగా గురువారం ప్రత్యేక పూజలు నిర్వహించారు. స్వామీజీలు ఇక్కడకు విచ్చేసిన సందర్భంగా రాధాకృష్ణులు, సుభద్ర బలభద్ర జగన్నాథస్వామి, సీతారాములు తదితర ఉత్సవమూర్తులను ఆకర్షణీయంగా అలంకరించారు. పలు ఆధ్యాత్మిక కార్యక్రమాలు ఘనంగా జరిపారు. ఈ నెల 21 వరకు రోజూ సాయంత్రం 6 నుంచి రాత్రి 9 గంటల వరకు స్వామీజీల ఆధ్యాత్మిక ప్రసంగాలు ఉంటాయని ఇస్కాన్ (విశాఖ) అధ్యక్షుడు సాంబాదాస్, మాతాజీ నితాయిసేవిని పేర్కొన్నారు.
హిందూస్తాన్ సమాచార, రాజీవ్
