మడకశిర, 4 జనవరి (హిం.స)
మున్సిపల్ కార్మికులు సమ్మెలోకి వెళ్ల డంతో మడకశిర పట్టణంలో చెత్తచెదారం కదలడం లేదు. ఎక్కడ పడితే అక్కడే ఉండడంతో పట్టణ వాసులు తీవ్ర ఇబ్బందులు పడతున్నా రు. తమ పలు సమస్యలు పరిష్కరించాలని కోరుతూ మున్సిపల్ కార్మి కులు సమ్మెలోకి వెళ్లారు. దీంతో మడకశిర పట్టణంలో పారిశుధ్య పనులు చేపట్టక పోవడం వల్ల ప్రధాన రహదారిపై ఎక్కడ పడితే అక్కడ చెత్త నిలిచిపోయింది. అమరాపురం ప్రధాన రహదారిలో పూర్తి స్థాయిలో చెత్త పడడంతో ప్రజలు, ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడుతురు. ప్రభుత్వం ప్రత్యామ్నాయం ఏర్పాటు చేయక పోవడంతో సమస్య అధికమైందని పట్టణ వాసులు అందోళన వ్యక్తం చేస్తున్నారు. కాలనీల్లో సైతం డ్రైనేజీల వద్ద చెత్త చెదారం పేరుకు పోయి ఎక్కడికక్కడ మురుగు నీరు రోడ్డు పైకి వస్తోంది. ప్రభుత్వం వెంటనే స్పందించి మున్సి పల్ కార్మికుల సమస్యలు పరిష్కరించాలని పట్టణవాసులు కోరుతున్నారు
హిందూస్తాన్ సమాచార్ ,సంధ్యా
