తెలంగాణ రంగా రెడ్డి షాద్ నగర్ ఏప్రిల్:
*అరుణమ్మను భారీ మెజారిటీతో గెలుపించుకుందాం*
*బిజెపి రాష్ట్ర కార్యవర్గ సభ్యులు పాలమూరు విష్ణువర్ధన్ రెడ్డి*
కేశంపేట్ మండలంలో బిజెపి రాష్ట్ర నాయకులు పాలమూరు విష్ణువర్ధన్ రెడ్డి బిజెపి పార్లమెంట్ అభ్యర్థి అరుణమ్మ గెలుపు కోసం ప్రచారం నిర్వహించడం జరిగింది. ప్రచారంలో భాగంగా సంగెం, ఎక్లాస్ ఖాన్ పేట్, భైర్కాన్ పల్లి, మంగళిగూడ, కోనాయ్ పల్లి పలు గ్రామాల్లో పర్యటించి ఉదృతంగా ప్రచారం నిర్వహించడం జరిగింది. ఎన్నికల ప్రచారం లో భాగంగా పాలమూరు విష్ణువర్ధన్ రెడ్డి మాట్లాడుతూ.. షాద్ నగర్ నియోజకవర్గం నుండి పార్లమెంట్ బిజెపి అభ్యర్థి అరుణమ్మను భారీ మెజారిటీ ఇద్దామని అన్నారు.
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఎన్నికల సమయం లో ఆరు గ్యారంటీ లు వంద రోజుల్లో చేస్తామని చెప్పి అధికారం లోకి వచ్చి ఇచ్చిన హామీలు అమలు చేయక అన్ని వర్గాల ప్రజలను మోసం చేశారని అన్నారు. ఇంకోసారి ప్రజలు మోసపోకుండా కాంగ్రెస్ పార్టీ కి ఓటు ద్వారా తగిన బుద్ది చెప్పాలని కోరారు. మన భవిష్యత్తు, మన పిల్లల దేశ భవిష్యత్తు బాగుండాలంటే కేంద్రం లో మరో సారి మన నరేంద్ర మోదీ ప్రధాన మంత్రి కావాలని అన్నారు.
