హైదరాబాద్, 12 డిసెంబర్ (హి.స.)
తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్
2025 విజయవంతంగా నిర్వహించడంపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి ప్రభుత్వ సలహాదారు, ప్రముఖ క్యాన్సర్ నిపుణులు డాక్టర్ నోరి దత్తాత్రేయుడు అభినందనలు తెలిపారు. గ్లోబల్ సమ్మిట్ చారిత్రాత్మక విజయమని పేర్కొంటూ ముఖ్యమంత్రి రేవంత్కు లేఖ రాశారు. డీల్టెక్, గ్రీన్ఎనర్జీ, లైఫ్ సైన్సెస్ వంటి రంగాల్లో పెద్ద ఎత్తున పెట్టుబడులు రావడం తెలంగాణ రైజింగ్-2047 విజన్కు అద్దం పడుతుందని, రూ. లక్షల కోట్ల పెట్టుబడులు రావడం ముఖ్యమంత్రి రేవంత్ పాలన, స్థిరత్వం, భవిష్యత్తుపైన ఉన్న విశ్వాసానికి నిదర్శనమని అన్నారు.
హిందూస్తాన్ సమచార్ / సంపత్ రావు, జర్నలిస్ట్..
