తిరుపతి,, 12 డిసెంబర్ (హి.స.)
చంద్రబాబు సారథ్యంలోని కూటమి ప్రభుత్వం క్రీడా అభివృద్ధికి అధిక ప్రాధాన్యతను ఇస్తుంది. తిరుపతిలోని దామినేడు వద్ద ఆంధ్రప్రదేశ్ క్రీడా ప్రాధికార సంస్థ (శాప్)కు 28.37 ఎకరాల భూమిని కేటాయించింది. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వం శుక్రవారం ఉత్తర్వులు జారీ చేసింది. తిరుపతిలో క్రీడ అభివృద్ధికి భూమిని కేటాయించాలని గతంలో సీఎం చంద్రబాబుని శాప్ చైర్మన్ రవి నాయుడు కోరిన సంగతి తెలిసిందే. దీనిపై సీఎం చంద్రబాబు సానుకూలంగా స్పందించారు.
—————
హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ
