



అమరావతి: 21 జనవరి (హిం.స) టీడీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బుద్దా వెంకన్న.. విజయవాడ ఎంపీ కేశినేని నానిని ఉద్దేశించి చేసిన ట్వీట్ చర్చనీయాంశమైంది. ఇటీవల చంద్రబాబు దంపతులు దుర్గగుడి దర్శనానికి వచ్చిన సందర్భంగా ఎంపీ కేశినేని నానికి ఆయన నమస్కరించి, వెంటబెట్టుకుని నడిచారు.
పార్టీ మారి వైకాపాలో చేరిన తర్వాత శుక్రవారం విజయవాడలో అంబేడ్కర్ విగ్రహావిష్కరణకు వచ్చిన సీఎం జగన్‌కు ఎంపీ కేశినేని రెండు చేతులతో నమస్కరిస్తున్నా.. కనీసం పట్టించుకోకుండా ముందుకు వెళ్లారు. ఈ రెండు వీడియోలను బుద్దా వెంకన్న ట్వీట్‌కు జతచేశారు.
హిందూస్తాన్ సమాచార, రాజీవ్
