విశాఖపట్నం(ఆంధ్రప్రదేశ్), ఏప్రిల్ 1 గో ఆధారిత ప్రకృతి వ్యవసాయాన్ని ప్రోత్సహించడానికి, ప్రకృతి వ్యవసాయ రైతులు, పర్యావరణ ప్రేమికులు, భూమి గురించి పనిచేసే కార్యాకర్తలు, సమాజ శ్రేయోభిలాషులు ఒక వేదిక వద్దకు చేర్చాలని ప్రకృతి వ్యవసాయదారుల సేవా సంఘం సంకల్పించింది. ఇందులో భాగంగా ప్రకృతి వ్యవసాయదారులకు ఏప్రిల్ ఏడవ తేదీన విశాఖలో ఉగాది పురస్కారాలను అందజేయనున్నట్లు సంఘం అధ్యక్షుడు దాట్ల సుబ్రహ్మణ్య వర్మ తెలిపారు. ఈ మేరకు ఇందుకు సంబందించిన ఫోస్టర్ ను విడుదలచేశారు. ఏప్రిల్ ఏడవ తేదీన సాయంత్రం 4 గంటల నుండి 6:30 వరకు విశాలాక్షీనగర్ భారతీయ విద్యాకేంద్రం జూనియర్ కాలేజీలో జరిగే ఆ కార్యక్రమంలో ప్రకృతి వ్యవసాయ రైతులు, మిద్దె తోట రైతులు తెచ్చిన మట్టితో భూమి పూజ జరుగుతుందని, అనంతరం భూమి గురించి, సమాజ శ్రేయస్సు గురించి తోడ్పడే వ్యక్తులకు పురస్కారాలు వుంటాయని తెలిపారు. సంఘంనేతలు అశోక్, మాధవరావు, సాయిబాబా , పూడేశ్వర్ పురోహిత్ తదితరులు పాల్గొన్నారు.
