దిల్లీ: దేశంలో మరోసారి జీఎస్టీ వసూళ్లు భారీగా నమోదయ్యాయి. ఫిబ్రవరి నెలకు గాను రూ.1.68 లక్షల కోట్లు వసూలైనట్లు కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ తెలిపింది. గతేడాది ఈ నెలతో పోలిస్తే ఇది 12.5 శాతం అధికం. ఆ ఏడాది రూ.1.51 లక్షల కోట్లు వసూళ్లు జరిగాయి. దేశీయ లావాదేవీలపై జీఎస్టీ వసూళ్లు 13.9 శాతం, దిగుమతైన వస్తువులపై వసూలయ్యే జీఎస్టీ 8.5 శాతం వృద్ధి కారణంగా జీఎస్టీ వసూళ్ల వృద్ధికి దోహదం చేసినట్లు ఆ శాఖ వెల్లడించింది.
ఫిబ్రవరి నెల వసూళ్లలో సెంట్రల్ జీఎస్టీ వాటా రూ.31,785 కోట్లు కాగా.. స్టేట్ జీఎస్టీ రూ.39,615 కోట్లుగా ఉంది. ఐజీఎస్టీ రూపంలో రూ.84,098 కోట్లు, సెస్సుల రూపంలో రూ.12,839 కోట్లు సమకూరినట్లు ఆర్థిక మంత్రిత్వశాఖ తెలిపింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో రూ.1.67 లక్షల కోట్లు చొప్పున నెలవారీ సగటు వసూళ్లు జరుగుతున్నట్లు పేర్కొంది. గత ఆర్థిక సంవత్సరంలో సగటు రూ.1.5 లక్షల కోట్లుగా
