ఢిల్లీ 12డిసెంబర్ (హి.స.) : అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌తో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గురువారం ఫోన్‌లో మాట్లాడారు. ద్వైపాక్షిక ఆర్థిక బంధాన్ని మరింత బలోపేతం చేసుకోవడం సహా పలు అంశాలపై చర్చించారు. వాణిజ్యం, క్రిటికల్ సాంకేతికతలు, ఇంధనం, రక్షణ, భద్రత వంటి రంగాల్లో పరస్పర సహకారాన్ని విస్తరించుకోవడంపై సమాలోచనలు జరిపారు. ఉమ్మడి ప్రయోజనాలతో ముడిపడి ఉన్న అంశాల్లో మరింత కలిసికట్టుగా పనిచేయాలని మోదీ, ట్రంప్ నిర్ణయించుకున్నారు. భారత్-అమెరికా సమగ్ర అంతర్జాతీయ వ్యూహాత్మక భాగస్వామ్యంలో పురోగతిని వారు సమీక్షించారు. అన్ని రంగాల్లో ద్వైపాక్షిక సహకారం నిలకడగా బలోపేతమవుతుండటంపై సంతృప్తి వ్యక్తం చేశారు.
—————
హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ
