తెలంగాణ : హైదరాబాద్
టీఎస్‌పీఎస్సీ ద్వారా ఆర్టీసీ జూనియర్ అసిస్టెంట్ ఉద్యోగాలకు ఎంపికైన వారికి బీఆర్ అంబేద్కర్ సచివాలయంలోని తన ఛాంబర్‌లో రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ నియామక పత్రాలు అందజేశారు. అర్హత సాధించిన మొత్తం 72 మందిలో మొదటి విడతగా 12 మంది జూనియర్ అసిస్టెంట్స్, 7 మంది ఆర్టీసి ఫైనాన్స్ విభాగంలో, ఐదుగురు పర్సనల్ విభాగంలో నియామకమయ్యారు. నూతనంగా ఉద్యోగాలు సాధించిన వారిని మంత్రి సత్కరించారు. నిబద్ధతతో పని చేసి సంస్థకు మంచి పేరు తీసుకురావాలని సూచించారు.
