body{font-family:Arial,sans-serif;font-size:10pt;}.cf0{font-weight:bold;font-family:Nirmala UI,sans-serif;font-size:11pt;}.pf0{}
ఢిల్లీ.,04జనవరి (హి.స.): దర్యాప్తు సంస్థలకు న్యాయస్థానాలు కాల పరిమితులు విధించడమనేది అన్ని సందర్భాల్లో జరగదని, అది అసాధారణ పరిస్థితుల్లో ఇచ్చే మినహాయింపు మాత్రమేనని సుప్రీంకోర్టు శనివారం పేర్కొంది. దర్యాప్తు ఆలస్యమైనప్పుడు తప్ప, గడువు అనేది అది ప్రతి కేసులో అనుసరించాల్సిన నియమం కాదని అత్యున్నత ధర్మాసనం స్పష్టంచేసింది. అలహాబాద్ హైకోర్టు జారీచేసిన ఓ ఉత్తర్వుపై విచారణ జరిపిన జస్టిస్ సంజయ్ కరోల్, జస్టిస్ ఎన్.కె. సింగ్‌ల ధర్మాసనం ఈ మేరకు వ్యాఖ్యానించింది. నకిలీ పత్రాలతో ఆయుధ లైసెన్సు పొందినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న ఒక కేసులో ఉత్తర్‌ప్రదేశ్ పోలీసులు 90 రోజుల్లో దర్యాప్తు పూర్తి చేయాలని, అంతవరకు నిందితులపై ఎటువంటి కఠిన చర్యలు తీసుకోవద్దని అలహాబాద్ హైకోర్టు ఆదేశించింది. ఈ ఆదేశాలను సుప్రీంకోర్టు తోసిపుచ్చింది. ‘‘విచారణలో ఆలస్యం జరిగి పక్షపాతం పైచేయి సాధిస్తున్న సందర్భాల్లో మాత్రమే కోర్టులు దర్యాప్తు సంస్థలకు గడువు విధిస్తుంటాయి. దర్యాప్తులో జరిగే ఆలస్యం వల్ల ప్రాథమిక హక్కులకు భంగం కలుగుతుందని భావించినప్పుడు మాత్రమే కోర్టులు జోక్యం చేసుకోవాలి. విచారణ ప్రారంభం కాకముందే కోర్టులు గడువు విధించవు. అలా చేయడం విచారణ
—————
హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ
