ఢీల్లీ, 8 జనవరి (హిం.స)
భారత ప్రధాని నరేంద్ర మోదీ లక్షదీప్ పర్యటన అనంతరం జరిగిన పరిణామాలు చర్చనీయాంశంగా మారిన విషయం తెలిసిందే. మాల్దీవులు మంత్రులు ప్రధాని మోదీపై చేసిన అనుచిత వ్యాఖ్యలపై దేశ ప్రజలు ఘాటూగా స్పందిస్తున్నారు. మాల్దీవులకు తాము బుక్ చేసుకున్న టూర్ను రద్దు చేసుకుంటున్నట్లు ప్రకటిస్తున్నారు.
ఇందుకు సంబంధించిన స్క్రీన్ షాట్స్ను సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తున్నారు. దీంతో బైకాట్మాల్దీవ్స్ అనే హ్యాష్ ట్యాగ్ బాగా ట్రెండ్ అవుతోంది. పలువురు బాలీవుడ్ నటులు సైతం మద్ధుతుగా పోస్ట్లు చేస్తున్నారు. బాలీవుడ్ నటులు అక్షయ్ కుమార్, సల్మాన్ ఖాన్ లక్షదీప్లో పర్యటిద్దాం, మన పర్యాటకానికి మద్దతు ఇద్దాం అంటూ సోషల్ మీడియాలో పోస్ట్లు చేశారు.
హిందూస్తాన్ సమాచార్, సంధ్యా
