





ఉరవకొండ, జనవరి 7: ( హిం స ) పొలం విషయం లో అనంతపురం జిల్లా ఉరవకొండ మండ లం వెలిగొండ గ్రామానికి చెందిన దళిత రై తు రామాంజనేయులును అదే ఊరికి చెం దిన వైసీపీ నాయకులు ఆదివారం తీవ్రంగా కొట్టి గాయపరిచారు.
దీనిపై పోలీసులు కనీ సం స్పందించకపోవడంతో బాధితుడు ఉవరకొండ పోలీసు స్టేషన్ వద్ద బైఠాయించి నిరసన తెలిపాడు. రామాంజనేయులుకు గ్రామ సమీపాన ఎకరాన్నర పొలం ఉంది. ఈ భూమిపై బంధువులతో వివాదం తలెత్తింది. ఇందులో గ్రామానికి చెందిన వైసీపీ నేతలు కలుగజేసుకున్నారు. ఈ నేపథ్యంలో స్వగ్రామం వెలిగొండ నుంచి ఉరవకొండకు ఆదివారం పని నిమిత్తం వెళ్తుండ గా.. అదే గ్రామానికి చెందిన వైసీపీ నాయకులు ఎంపీపీ నరసింహులు కుమారుడు శివానంద, శివకుమార్, మోహన్, రాజేష్, శివకుమార్ విచక్షణారహితంగా రామాంజనేయులుపై దాడి చేశారు. కులం పేరుతో దూషించారు. కాగా, రక్తగాయాలతో పోలీసు స్టేషన్‌కు వెళ్లగా ఫిర్యాదు తీసుకోకపోవడంతో రైతు రామాంజనేయులు, అతడి భార్య అక్కడే బైఠాయించారు.
హిందూస్తాన్ సమాచార, రాజీవ్
