విశాఖపట్నం(ఆంధ్రప్రదేశ్), జనవరి 27 : అడవివరం గ్రామ పరిధిలో ఉన్న శ్మశాన వాటికకు వెళ్లే మార్గంలో పూర్తిస్థాయిలో సదుపాయాలు కల్పించేందుకు తమ వంతు ప్రయత్నాలు చేస్తున్నామని అప్పన్న ఆలయ ఈవో సింహం శ్రీనివాస్ మూర్తి తెలిపారు. సింహాచలం దేవస్థానం ధర్మకర్తల మండల సభ్యులు గంట్ల శ్రీనుబాబు ఈ స్మశాన వాటికకు సంబంధించిన పలు అంశాలను శనివారం ఈవో దృష్టికి తీసుకువెళ్లారు వరాహ పుష్కరిణి ప్రాంగణం ఆనుకొని ఉన్న ఈ స్మశాన వాటికకు సరైన రహదారి సదుపాయం లేదని అంతేకాకుండా మార్గమధ్యంలో సరైన సదుపాయాలు లేవని ఈవో కి వివరించారు దీనిపై ఈవో సానుకూలంగా స్పందించారు ఇప్పటికే తాను స్మశాన వాటిక ప్రాంతాన్ని మార్గాన్ని పరిశీలించడం జరిగింది అన్నారు. అవసరమైన మూడు చోట్ల అభివృద్ధి పనులు చేసేందుకు నిర్ణయించమన్నారు ఎందుకు సంబంధించి తమ ఇంజనీరింగ్ అధికారులకు ఇప్పటికే తగిన ఆదేశాలు జారీ చేశామన్నారు జీవీఎంసీ నుంచి కూడా తగిన తగిన సహకారం తీసుకోవాల్సి ఉందని కమిషనర్ తో చర్చించి త్వరలోనే ఆపనులు కార్యరూపం దాల్చిన చూస్తామన్నారు ఈ సందర్భంగా గంటల శీను బాబు మాట్లాడుతూ తను అప్పటికే ఈ విషయాన్ని పలు అధికారులు దృష్టికి తీసుకెళ్లామని దేవస్థానం సానుకూలంగా స్పందిస్తే జీవీఎంసీ నుంచి తగిన సహకారం కచ్చితంగా లభిస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు సుమారు 30 లక్షల నిధులు మంజూరుకు జీవీఎంసీ ఇప్పటికే సుముఖత వ్యక్తం చేసింది అన్నారు.
