ఢిల్లీ : జనవరి 27 : కేరళలో అక్కడి ప్రభుత్వానికి, గవర్నర్ ఆరిఫ్ మహ్మద్ ఖాన్‌కు మధ్య నెలకొన్న వివాదం రోజురోజుకు మరింత తీవ్రమవుతోంది. శుక్రవారం 75వ గణతంత్ర దినోత్సవం సందర్భంగా జాతీయ పతాకాన్ని ఆవిష్కరించిన గవర్నర్ కేవలం 78 సెకన్‌లు మాత్రమే ప్రసంగించారు. ప్రభుత్వం ఇచ్చిన 60 పేజీల ప్రసంగాన్ని చదవకుండా పక్కనపడేశారు. దాంతో రాజ్‌భవన్‌లో జరిగిన ఎట్ హోమ్‌ను పినరయి విజయన్ సర్కారు బహిష్కరించింది.
