చినగంజాం : బాపట్ల జిల్లా చినగంజాం మండలకేంద్రంలోని పురాతన శ్రీ గంగా పార్వతీ సమేత చిదంబరేశ్వరస్వామి ఆలయంలోని (శివలింగం) స్వామివారిని సూర్యకిరణాలు తాకాయి. సోమవారం ఉదయం 7.05 గంటల నుంచి 7.09 గంటల వరకు దాదాపు 4 నిమిషాల పాటు స్వామివారిని సూర్యకిరణాలు తాకాయి. ఈ అపురూప దృశ్యాలను అధిక సంఖ్యలో భక్తులు తిలకించారు. అనంతరం అర్చకుడు కొలిపర అప్పారావు స్వామివారికి అభిషేక పూజలు నిర్వహించారు.
