ఢిల్లీ : జనవరి 27 : కేరళ రాష్ట్రంలో ఉద్రిక్త పరిస్థితులు చోటు చేసుకున్న విషయం తెలిసిందే. శనివారం ఉదయం గవర్నర్ ఆరిఫ్ మహ్మద్ ఖాన్ కు నిరసన సెగ తగిలింది. యూనివర్సిటీ ఛాన్సెలర్ల నియామకానికి గవర్నర్ అడ్డుపుల్ల వేస్తున్నాడంటూ SFI ఆందోళనకారులు కొల్లామ్‌లో గవర్నర్ కాన్వాయ్‌కి అడ్డుతగిలారు. దాంతో ఆగ్రహించిన గవర్నర్ కారు దిగి ఆందోళనకారుల వైపు దూసుకెళ్లారు. ఈ క్రమంలో పోలీసుల తీరును గవర్నర్ తీవ్రంగా తప్పుబట్టారు. ఈ ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం అప్రమత్తమైంది. గవర్నర్ భద్రతను పెంచింది. రాజ్‌భవన్, గవర్నర్‌కు జెడ్ ప్లస్ భద్రతను కల్పిస్తూ కేంద్ర హోం మంత్రిత్వ శాఖ నిర్ణయించింది. ఈ మేరకు ఆదేశాలు జారీ చేసింది.
