









బాపట్ల:23 జనవరి (హిం.స) రాష్ట్రంలో తుది ఓటర్ల జాబితా వెలువడింది. సోమవారం విడుదల చేసిన జాబితాలో బాపట్ల జిల్లా పర్చూరు నియోజకవర్గంలో 13 వేల పైచిలుకు ఓట్లు తొలగించారు.
ఎవరి ఓటు ఉందో, ఎవరిది పోయిందో.. జాబితా పరిశీలించుకుంటే తప్ప తెలిసే పరిస్థితి లేకపోవడంతో ఓటర్లలో ఆందోళన వ్యక్తమవుతోంది.
టీడీపీ కు కంచుకోట లాంటి ఈ నియోజకవర్గంలో ఎలాగైనా గెలవాలని వైకాపా ఓటర్ల సవరణ ప్రక్రియ ప్రారంభం నుంచే తన ప్రయత్నాలు మొదలుపెట్టింది. ఓట్ల తొలగింపు కోరుతూ 23,666 ఫాం-7 దరఖాస్తులు పెట్టగా వాటిలో 13,558 ఓట్లు తొలగించారు.
హిందూస్తాన్ సమాచార, రాజీవ్
