









అయోధ్య:23 జనవరి (హిం.స) అయోధ్య రామమందిర తలుపులు సామాన్య భక్తులకు తెరుచుకోవటంతో మరో చరిత్రాత్మక ఘట్టం ఆవిష్కృతమైంది. మంగళవారం ఉదయం నుంచి స్వామివారి దర్శన భాగ్యానికి సామాన్యులను అనుమతించారు.
సోమవారం ఘనంగా జరిగిన ప్రాణప్రతిష్ఠ తర్వాత కేవలం అతిథులు మాత్రమే శ్రీరాముడిని దర్శించుకున్నారు. ఇక నుంచి సామాన్య భక్తులందరూ బాలరాముడిని దర్శించుకోవచ్చు.
హిందూస్తాన్ సమాచార, రాజీవ్
