విజయవాడ 09 ఏప్రిల్ఉ గాది పర్వదిన పురస్కరించుకుని అనేక దేవాలయాలు భక్తులతో( రద్దీగా మారాయి. తెలుగువారికి నూతన సంవత్సర పండుగ ఉగాది ప్రతి సంవత్సరం ఛైత్ర మాసం శుక్ల పక్షం పాడ్యమి తిథి రోజు తెలుగు నూతన సంవత్సరం ప్రారంభమవుతుంది. ఈ ఏడాది క్రోధ నామ సంవత్సరం వచ్చింది. ఈ నేపథ్యంలో ప్రజలు తీపి, వగరు, చేదు, కారం, పులుపు, ఉప్పు వంటి షడ్రుచులు కలసిన ఉగాది పచ్చడి స్వీకరించి పండుగ జరుపుకుంటున్నారు. ఉగాది పర్వదినాన్ని పురస్కరించుకొని గుంటూరు దశావతారం ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. కోటి పుష్పాలతో ప్రత్యేక పూజా కార్యక్రమాలు చేశారు.
