సంగారెడ్డి సంగారెడ్డి జిల్లా హత్నూర మండలం చందాపూర్ సమీపంలోని ఎస్బీ ఆర్గానిక్స్ పరిశ్రమలో చోటు చేసుకున్న ప్రమాదంపై కేంద్రమంత్రి కిషన్ రెడ్డి దిగ్భ్రాంతి వ్యక్తం చేసారు
రియాక్టర్ పేలడంతో ఈ మంటలు చెలరేగినట్లు అధికారులు చెప్తున్నారని తక్షణమే సహాయక చర్యలు వేగవంతం చేసి, మంటలు అదువులోకి తీసుకురావాలని ప్రభుత్వాన్ని కోరారు
ప్రమాదంలో గాయపడిన వారికి మెరుగైన వైద్య సహాయం అందించాలని ప్రమాదంలో మృతి చెందిన కుటుంబాలకు సానుభూతి తెలియజేశారు. ఆ కుటుంబాలని ప్రభుత్వం ఆదుకోవాలని డిమాండ్ చేసారు
