దిల్లీ కొత్త విద్యా సంవత్సరంలో సిలబస్ మార్పు, పాఠ్యపుస్తకాల విడుదలపై ఎన్‌సీఈఆర్టీ (నేషనల్ కౌన్సిల్ ఆఫ్ ఎడ్యుకేషనల్ రీసెర్చ్ అండ్ ట్రైనింగ్) కీలక ప్రకటన చేసింది. 3, 6వ తరగతులకు మాత్రమే కొత్త సిలబస్‌తో పాఠ్య పుస్తకాలు విడుదల చేయనున్నట్లు తెలిపింది. మూడో తరగతి పుస్తకాలు ఏప్రిల్ చివరివారంలో, ఆరో తరగతి పుస్తకాలను మే మధ్యకాలం నాటికి విడుదలవుతాయని వెల్లడించింది. అలాగే 1, 2, 7, 8, 10, 12 తరగతులకు సంబంధించి 2023-24 ఎడిషన్స్ పాఠ్య పుస్తకాలు 1.21 కోట్ల కాపీలు దేశవ్యాప్తంగా విడుదల చేసినట్లు తెలిపింది. మారిన కరికులమ్‌కు అనుగుణంగా ఆరో తరగతి విద్యార్థులను ప్రిపేర్ చేసేందుకు వీలుగా ఉపాధ్యాయుల కోసం NCERT పోర్టల్‌లో బ్రిడ్జ్ కోర్సు అందుబాటులో ఉందని తెలిపింది. ఈమేరకు ‘ఎక్స్’ వేదికగా ట్వీట్ చేసింది.
