శ్రీశైలం 13 అక్టోబర్ (హిం.స) శ్రీశైలంలో ఈనెల 15 నుంచి 24 వరకు దసరా దేవి శరన్నవరాత్రులు జరగనున్నాయి. దసరాకు వచ్చే భక్తులకు సౌకర్యవంతమైన దర్శనం, వసతి కల్పిస్తామని శ్రీశైలం ఆలయ ఈవో వెల్లడించారు.
ఉత్సవాల సమయంలో కుంకుమార్చన, అభిషేకాలు, కల్యాణోత్సవం యధావిధిగా కొనసాగనుంది. 15న ఉదయం శ్రీస్వామివారి అమ్మవారి యాగశాలల ప్రవేశంతో దసరా మహోత్సవాలకు శ్రీకారం చుట్టనున్నారు. ఈ తొమ్మిది రోజుల పాటు అమ్మవారు ప్రతి రోజు వివిధ అలంకారాలతో వివిధ వాహన సేవలను స్వీకరించనున్నారు.
